ఎడతెరుపు లేని వర్షాలతో ప్రజలు అప్రమత్తం గా ఉండాలిఎడతెరుపు లేని వర్షాలతో ప్రజలు అప్రమత్తం గా ఉండాలి

తెలంగాణ రాష్ట్రంలో లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కోదాడ పట్టణం లోని 27వ & 33వ వార్డ్ లను కలుపుకొని ఉన్న ఎర్ర కుంట వాగు బ్రిడ్జి కి కొట్టుకు వొచ్చిన గుర్రపు డెక్క మరియు సిల్ట్ ని జెసిబి సహాయం తో తొలగించే పనులను మరియు అనంతగిరి రోడ్ లోని పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటు వంటి గూనలలో ఇరుక్కు పోయిన చెత్త చెదారం ని తొలగించు పనులను దగ్గర ఉండి పరిశీలించిన కోదాడ మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వాతావరణ శాఖ వారి సమాచారం ప్రకారం వచ్చే రెండు మూడు రోజులు కూడా ఇలానే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ప్రజలకు ఇబ్బంది జరగకుండా సమస్యలు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మునిసిపల్ శాఖ వారిని 8374450353 నెంబర్ లో సంప్రదించాలని, తప్పనిసరి అయితే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమం లో వీరితో పాటు వార్డ్ కౌన్సిలర్ sk.షాబుద్దిన్,మాజీ కౌన్సిలర్ ఎండీ ఉద్దండు,సానిటరీ ఇన్స్పెక్టర్ యాదగిరి, మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు…

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *