ప్రజాస్వామ్యాన్ని హేళన చేసేవాళ్లు మతోన్మాదులు క్విట్ ఇండియాప్రజాస్వామ్యాన్ని హేళన చేసేవాళ్లు మతోన్మాదులు క్విట్ ఇండియా

మన భారత ప్రజాస్వామ్యాన్ని హేళన చేసేవాదులు మతోన్మాదులు ఫాసిస్టులు క్విట్ ఇండియా కావాలని రిటైర్డ్ ఐఏఎస్ చోల్లేటి ప్రభాకర్ KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని అన్నారు. ఆగస్టు 8 క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్య ఫోరం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రజా సంఘాల ఆద్వర్యంలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్లో సమావేశమై ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో మణిపూర్ హర్యానా ఢిల్లీ లాంటి ప్రాంతాలకు ఫాసిస్ట్ ఉన్మాదుల చర్యల వలన ప్రజలపై దాడులు పెరిగాయని మహిళలు వృద్ధులు పిల్లలు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారని మనిషిని మనిషిని గౌరవించని ఈ ఉన్మాదము దేనికని ప్రశ్నించారు. మనుషులంతా సమానమని అన్ని మతాలు కులాలు, సాంప్రదాయాలు సంస్కృతులు లౌకికవాదం భారతదేశ భిన్న సంస్కృతలకు నిలయమని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో మనుషులను చంపడం ఘోరమైన నేరమని దాడులకు పాల్పడే వారిని ఈ ప్రజలు బహిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాస్ జిల్లా నాయకులు ఒంటెపాకా యాదగిరి నాయకులు నలపరాజు సైదులు అద్దంకి నరసింహ ఇస్తారు తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *