telugu galam telugu news mulugu news e69news local newstelugu galam telugu news mulugu news e69news local news

ఐలాపూర్ కొమరం భీమ్ యూత్ డిమాండ్. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ఐలాపూర్ గ్రామంలో మంగళ వారం కొమరం భీమ్ యూత్ ప్రధాన కార్యదర్శి ఆలం నగేష్ మాట్లాడుతూ 2023 సంవత్సరములో ఐలాపూర్ సమ్మక్క సారలమ్మ నాగులమ్మాల జాతరకు, ములుగు శాసనసభ్యులు సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య, ఐటీడీఏ ఏటూరునాగారం పీఓ అంఖిత్. తుడుందెబ్బ నాయకులు అర్రేమ్ లచ్చు పటేల్, పులిష బాలకృష్ణ, మేడారం సమ్మక్క పూజారి సిద్దబోయిన స్వామి ప్రత్యేక సొరవ తీసుకొని ఆదివాసుల పవిత్ర ఆరాధ్య దేవతలను కాపాడుకువాలని 31లక్షల రూపాయిలు మంజూరు చేసి జాతర ప్రాంగణంలో విద్యుత్ లైన్, 500 పిట్స్ బోర్ పైంట్, స్నానగట్టాలు, గుడులకు గేట్స్, సత్తర్, పేంటింగ్, సున్నం, లైటింగ్ ఐలాపూర్ నుండి కొండాయి, సర్వాయి, ఐలాపూర్ నుండి కాల్వపల్లి.ఐలాపూర్ నుండి రెడ్డిపల్లి ఎడ్ల బండ్ల దార్లను మరమ్మత్ చేయూటకు జాతర నిర్వహణకు 6 దశబ్దలా కాలం నుండి ఇదే మొదటి సారి అధిక నిధులు ఇవ్వటం జరిగింది. మా గ్రామం తరుపునా ప్రత్యేక ధన్యవాదములు. 2024 మేడారం సమ్మక్క సారాలమ్మ, కుంభమేల మహా జాతర తర్వాత, ఐలాపూర్ గ్రామంలో పిలుస్తే పలికే ఆదివాసుల ఇలావేల్పుల అదిశక్తులు సమ్మక్క సారాలమ్మ, నాగులమ్మల తిరుగువారం సుంకు తీర్థం పండుగ. తేదీ:28,29/02/2024 రోజులలో నిర్వహిస్తామనీ ఐటీడీఏ పీఓ అంఖిత్ కు వినతి పత్రం ఇవ్వగా సానుకూలంగా స్పందించి ఐలాపూర్ సమ్మక్క సారాలమ్మా, నాగులమ్మా తిరుగువారం సుంకుతిర్థం పండుగకు ప్రత్యేక నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ అంఖిత్ బదిలీ పత్రం రద్దు చేసి తిరిగి యధావిధిగా ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారిగా నియమించకుంటే ఐలాపూర్ గ్రామ పంచాయితీ నుండి భీమ్ దాదా స్పూర్తీతో కొమురం భీమ్ యూత్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో మహా ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నాము అని మీడియాకు వెల్లడించారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *