palavancha local news e69news bahdradri kothagudem newsఏసీబీ వలలో పాల్వంచ మున్సిపల్ అవినీతి చేపలు

పాల్వంచ పట్టణంలో ఎట్టకేలకు అవినీతి పై యుద్ధం మొదలైంది పెద్ద పెద్ద తిమింగలాలు కాకుండా చిన్న చేపలు అవినీతి నిరోధక శాఖ చిక్కుతున్నాయి తాజాగా గురువారం పాల్వంచ మున్సిపాలిటీలో ఏసీబీ దాడి జరిగింది ఈ దాడిలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఇద్దరినీ ఏసీబీ అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి పాల్వంచకు చెందిన కాంపెల్లి కనకేష్ ఎల్. ఆర్. ఎస్ కొరకు దరఖాస్తు చేయగా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రమణి, ఔట్సోర్సింగ్ ఉద్యోగి ప్రసన్న 15, 000 లంచం డిమాండ్ చేయటంతో కనకేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
చాలాకాలంగా పాల్వంచ మున్సిపల్, తాసిల్దార్,ఇతర కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని, అలాగే పెద్ద ఎత్తున కొంతమంది నేతలకు నజరానాలు ఇచ్చేందుకు అధికారులు జనం ముక్కుపిండి మరి మామూలు వసూలు చేస్తు నేతల జేబులు,నింపారు.
చిన్నచిన్న చేపల్ని కాకుండా,పెద్ద తిమింగలాలను కూడా ఏసీబీ అధికారులు పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో సైతం పెద్ద ఎత్తున వివిధ శాఖలు జరిగే రిక్రూట్మెంట్లలో అవినీతి చోటు చేసుకుంటుంది.
రెండు నుంచి నాలుగు లక్షలు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దీనిపై కూడా అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మెడికల్ కాలేజీలో సైతం ఔట్సోర్సింగ్ లో ఇటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *