elections news telugu news e69news telugu galam news daily news telugu varthaluమహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్ లోక్ సభ సాధారణ ఎన్నికలల్లో పోటీ చేయు అభ్యర్థులు ఖర్చుల రిజిస్టర్లు పరిశీలనకు తేవాలని మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల వ్యయ వివరాల మొదటి పరిశీలన మే 3వ తేదీన, రెండో పరిశీలన మే 7న, అలాగే మూడో పరిశీలన మే 11వ తేదీన ఎన్నికల వ్యయ పరిశీలకులు ఉమాకాంత దృపాటి నిర్వహించనున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశపు హాలులో పైన తెలిపిన తేదీల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వ్యయ పరిశీలకులు ఉమాకాంత దృపాటి అందుబాటులో ఉంటారని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు లేదా అభ్యర్థుల తరుపున వారి ఏజెంట్లు సంబంధిత వ్యయ రిజిష్టర్లతో హాజరుకావాలన్నారు. పరిశీలనకు హాజరు కాని పక్షంలో ఎన్నికల సంగం మార్గదర్శకాల మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *