అధ్యక్షులు మిద్దెల సత్యనారాయణఅధ్యక్షులు మిద్దెల సత్యనారాయణ

-టిడబ్ల్యూజెఎఫ్ రంగారెడ్డి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు మిద్దెల సత్యనారాయణ

తెలుగు గళం న్యూస్ రంగారెడ్డి నవంబర్ 30

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న జర్నలిస్టులకు సంబంధించిన ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని కనీసం కొత్త అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి లేదని జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య ఇప్పటివరకు ఊసే లేదని ఆరోగ్య భీమా పథకం ఆటకెక్కిందని చిన్న మధ్య తరహా పత్రికలు సంక్షోభంలో పడ్డాయని ఈ సమస్యల సాధన కోసం రేపు టిడబ్ల్యుజేఎఫ్,తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్,నూతనంగా ఏర్పడిన రాష్ట్ర కన్వీనింగ్ కమిటి రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య కోకన్వీనర్లు పులిపలుపుల ఆనందం,బండి విజయకుమార్,తన్నీరు శ్రీనివాస్,వల్లలా జగన్,బాపూరావు,ఆర్.వెంకటేశ్వర్లు ఏం.యాదగిరి జి.వెంకటేశ్వర్లు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలివచ్చి చలో సమాచార భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా(టిడబ్ల్యుజెఎఫ్)వ్యవస్థాపక అధ్యక్షులు మిద్దెల సత్యనారాయణ తెలిపారు.ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు ఎంబడీ మల్లేష్,ఆలుగొండ శీనయ్య,మల్లేష్ చంద్రశేఖర్,రాము,మధు,రాజశేఖర్ ,తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *