
ఈ69న్యూస్ పర్వతగిరి, సెప్టెంబర్ 23
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్గా పిన్నింటి అనిల్రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కల్లెడ గ్రామంలోని పీఏసీఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్తో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ పిన్నింటి అనిల్రావు మాట్లాడుతూ..తనపై నమ్మకంతో చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్యతో పాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని, పీఏసీఎస్ ద్వారా రైతులకు అందాల్సిన సేవలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని అన్నారు.రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. పీఏసీఎస్ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, రైతులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.
నూతన పీఏసీఎస్ పాలకవర్గం

చైర్మన్: పిన్నింటి అనిల్రావు,పాలకవర్గ సభ్యులు: ఎలికట్టె వెంకటేశ్వర్లు, నరెడ్ల సూరయ్య, ముదురుకోళ లక్ష్మి, ఎర్రబెల్లి వెంకటేశ్వర్రావు, మోటపోతుల సుదర్శనం, నీలం శ్రీనివాస్, ఆబర్ల రవి, బొబ్బాల లింగారెడ్డి, బొట్ల మహేంద్ర, కత్తుల శ్రీనివాస్, ధారావత్ సేత్రం, గుగులోతు సుధాకర్.కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.