- పీహెచ్‌సీ మౌలిక వసతుల మెరుగుదలకు చర్యలు
- మైనర్ రిపేర్లు త్వరలోనే చేపడతాం
తెలుగు గళం గోవిందరావుపేట, సెప్టెంబర్ 29:
- ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం
- – మండల కాంగ్రెస్ అధ్యక్షులు చెట్టిపెళ్లి వెంకటేశ్వర్లు
- మంత్రి సీతక్క ప్రత్యేక చొరవకు రామచంద్రునిపేట గ్రామస్తుల కృతజ్ఞతలు
- సబ్‌స్టేషన్‌తో రైతులు, ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా
తెలుగు గళం మంగపేట, సెప్టెంబర్ 29:
మంగపేట మండలం రాజుపేట కేంద్రంగా రామచంద్రునిపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌కు రూ.3.27 కోట్ల నిధులు మంజూరు కావడం హర్షణీయమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెట్టిపెళ్లి వెంకటేశ్వర్లు అన్నారు. మంగపేటలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవ చూపారని తెలిపారు. సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే రాజుపేట పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మెరుగుపడి, వ్యవసాయంతో పాటు గృహ అవసరాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. రామచంద్రునిపేట సబ్‌స్టేషన్‌కు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్కకు చెట్టిపెళ్లి వెంకటేశ్వర్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య, దేవస్థానం డైరెక్టర్ పూజారి సురేందర్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చింతా పున్నారావు, పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
