,ఎమ్మెల్యే మట్టా ప్రత్యేక పూజలు,ఎమ్మెల్యే మట్టా ప్రత్యేక పూజలు

సత్తుపల్లి,ఆర్ సి,అక్టోబర్ 21 (తెలుగుగళం) న్యూస్:
విజయదశమి సందర్భంగా ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ లు సత్తుపల్లి మండల పరిధిలోని రేజర్ల గ్రామ సమీపంలోని గుట్టపై కొలువుదీరిన శ్రీ నాగ మల్లేశ్వరస్వామి కు పొంగులేటి,సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకున్నారు. తెలుగు ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో: ఆలయ కమిటీ సభ్యులు,మండల కాంగ్రెస్ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, రేజర్ల సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,పొంగులేటి,మట్టా అభిమానులు,భక్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *