జనగామ నుంచి 600 కిలోమీటర్లు రానుపోను ప్రయాణించి నిరుపేద కుటుంబానికి ఆర్థిక చేయూతజనగామ నుంచి 600 కిలోమీటర్లు రానుపోను ప్రయాణించి నిరుపేద కుటుంబానికి ఆర్థిక చేయూత

జనగామ నుంచి 600 కిలోమీటర్లు రానుపోను ప్రయాణించి నిరుపేద కుటుంబానికి ఆర్థిక చేయూత

రూ.20,025 అందజేత.. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి అండగా నిలిచిన ఫౌండేషన్ సభ్యులుసేవా కార్యక్రమాలకు ప్రాంతీయ హద్దులు ఉండవని ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ మరోసారి చాటిచెప్పింది. జనగామ జిల్లా నుంచి సుమారు 600 కిలోమీటర్లు రానుపోను ప్రయాణించి, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న ఓ నిరుపేద కుటుంబానికి రూ.20,025 ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకుంది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కిరణ్ పుట్టుకతోనే ఒకే కిడ్నీతో జీవిస్తున్నారు. ప్రస్తుతం షుగర్ వ్యాధి కారణంగా ఆ ఒక్క కిడ్నీ కూడా దెబ్బతినడంతో పాటు, రెండు కాళ్లకు వాపులు రావడంతో తీవ్ర అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పూరిగుడిసెలో నివసిస్తున్న ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. వైద్య ఖర్చులు భరించలేని దయనీయ పరిస్థితిలో కుటుంబం జీవనం సాగిస్తోంది.ఈ నిరుపేద కుటుంబం పరిస్థితిని తెలుసుకున్న ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. పెదపూడి ప్రసన్న కుమార్ వెంటనే స్పందించారు. కుటుంబానికి అండగా నిలవాలని ఫౌండేషన్ సభ్యులు, దాతలకు విజ్ఞప్తి చేశారు. ఆయన పిలుపునకు స్పందించిన సభ్యులు, దాతలు ఫోన్‌పే ద్వారా మొత్తం రూ.20,025 విరాళాలను సమకూర్చారు.సేకరించిన విరాళాలను బాధిత కుటుంబానికి నేరుగా అందజేసేందుకు ఫౌండేషన్ సభ్యుడు బేతపూడి శేఖర్ ముందుకొచ్చారు. జనగామ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు సుమారు 600 కిలోమీటర్లు రానుపోను ప్రయాణించి, కిరణ్ కుటుంబాన్ని స్వయంగా కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా బేతపూడి శేఖర్ మాట్లాడుతూ, ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సేవలు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల వరకు విస్తరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆపదలో ఉన్న కుటుంబానికి సహాయం అందించేందుకు ఇంత దూరం ప్రయాణించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. సేవ చేయాలనే సంకల్పం ఉంటే దూరం ఎప్పుడూ అడ్డంకి కాదని పేర్కొన్నారు.ఆర్థిక సహాయం అందుకున్న కిరణ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమకు పరిచయం లేని వ్యక్తులు సైతం తమ కష్టాన్ని తెలుసుకుని మానవత్వంతో స్పందించి సహాయం చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. తమకు అండగా నిలిచిన దాతలకు, ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బేతపూడి శేఖర్, ప్రసాద్, వినోద్, అబ్బాసాయిలు తదితరులు పాల్గొన్నారు.సరిహద్దులు దాటిన సేవా స్ఫూర్తి.. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్!

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *