** టిఆర్ఎస్ పై పూర్తి భరోసాతో పలు పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని *కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్* అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునగాల మండలం రేపాల గ్రామం మాజీ సర్పంచ్ బెజవాడ కృష్ణయ్య, రేపాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు నర్సిరెడ్డిలు టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఇస్తామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కష్టపడే వారికి ప్రతి స్థాయిలో గుర్తింపు ఉంటుందన్నారు . టిఆర్ఎస్ పార్టీ అందరికీ అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు శ్రీరామరక్షగా ఉన్నాయన్నారు. వారితోపాటు 10 కుటుంబాలు టిఆర్ఎస్ లో చేరారు. అనంతరం రేపాలకు చెందిన పాముల రాఘవేందర్ ను సోషల్ మీడియా కన్వీనర్ గా నియామకం చేస్తూ నియామక పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోగరు రమేష్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు నల్లపాటి శ్రీనివాసరావు, రేపాల ఎంపిటిసి సోమపొంగు మోహన్, గ్రామ శాఖ అధ్యక్షులు ఆదిరెడ్డి,మాజీ ఎంపిటిసి శ్రీనివాస్, నరసింహ స్వామి ఆలయ చైర్మన్ పొనుగోటి రంగా, మాజీ అధ్యక్షులు సత్యనారాయణ, ముకుందాపురం ఎంపీటీసీ రామకృష్ణ, సంగిశెట్టి గోపాల్, మండల నాయకులు చంద్రయ్య, బంగారు సత్యనారాయణ, బెజవాడ సీతారాములు, దేవరం నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *