E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ6 January, 2023E69NEWS

మంత్రి గంగుల కమలాకర్ ను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

(కరీంనగర్, జనవరి 06)

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర మరియు ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ గారి తండ్రి గంగుల మల్లయ్య(85) గారు ఇటీవల మృతి చెందడంతో నేడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.మంత్రి కమలాకర్ గారి నివాసానికి వెళ్ళి, మల్లయ్య గారి చిత్రపటం వద్ద పూలు చల్లి, నివాళులు అర్పించారు. మంత్రి కమలాకర్ గారిని పరామర్శించారు.

మల్లయ్య గారి మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *