టి-20 క్రికెట్ పోటీల్లో నిజామాబాద్ వరుస విజయాలుటి-20 క్రికెట్ పోటీల్లో నిజామాబాద్ వరుస విజయాలు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ9 January, 2026E69NEWS

టి-20 క్రికెట్ పోటీల్లో నిజామాబాద్ వరుస విజయాలు

టి-20 క్రికెట్ పోటీల్లో నిజామాబాద్ వరుస విజయాలు

వంగాలపల్లిలో డబ్ల్యుడిసీఏ మైదానంలో జరిగిన
కాక వెంకట స్వామి మెమోరియల్ టి-20 ఫేజ్- 2 క్రికెట్ పోటీల్లో వరంగల్లో జరుగుతున్న మ్యాచ్లో వరుస విజయాల్ని నిజామాబాద్ నమోదు చేసుకోగా,నిన్న ఓడిపోయిన రంగారెడ్డి,ఖమ్మం జట్లు ఈరోజు గెలిచి పర్వాలేదు అనిపించాయి,కాగా ఆహ్వానిత వరంగల్ జట్టు మాత్రం ఉత్కంఠ భరితమైన మ్యాచులో ఒత్తిడి తట్టుకోలేక 9 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టుతో ఓటమి చెందిందని డబ్ల్యుడిసీఏ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం రోజు మ్యాచ్ లో కరీంనగర్ జట్టు వరంగల్ జట్టుపై 9 పరుగుల తేడాతో గెలుపొందింది,మొదట బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 153 పరుగులు సాధించింది.జట్టులో తక్షిల్ అద్భుత 6 బౌండరీలు ఒక సిక్సర్ సహాయంతో 56 పరుగులు సాధించగా,154 లక్ష్య చేదనలో బరిలోకి దిగిన వరంగల్ జట్టు 19.3 ఓవర్లు మాత్రమే ఎదుర్కొని 144 పరుగులకు ఆలౌట్ కావడంతో వరంగల్ జట్టు ఓటమి మూటకట్టుకున్నది.కరీంనగర్ బ్యాట్స్మెన్ తక్షిల్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.ఇదే గ్రౌండ్లో మధ్యాహ్నం జరిగిన రెండవ మ్యాచ్ లో నిజామాబాద్ జట్టు మెదక్ జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది,మొదట బ్యాటింగ్ చేసిన మెదక్ జట్టు 20 ఓవర్లు ఎదుర్కొని కేవలం 119 పరుగులు మాత్రమే సాధించింది, మెదక్ జట్టులో లోహిత్ 37 పరుగుల తో జట్టును ఆదుకున్నాడు,నిజామాబాద్ జట్టు బౌలర్లు సాయి ప్రతీక్,లలిత్ రెడ్డి నవీన్ తల 3 వికెట్లతో మెదక్ జట్టును కట్టడిచేశారు.120 పరుగుల లక్ష చేదనలో బరిలోకి దిగిన నిజామాబాద్ జట్టు కేవలం 16.3 ఓవర్లు ఎదుర్కొని 120 పరుగులు సాధించడంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ సాయి ప్రతీక్ కి స్థానిక సర్పంచ్ మేనక బహుకరించారు.టీవీవీఎస్ సుకాంత్ గ్రౌండ్ లో జరిగిన తొలి మ్యాచులో రంగారెడ్డి జట్టు ఖమ్మం జట్టుపై గెలుపొందింది.9 వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించిన రంగారెడ్డి నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోలేకపోయిన ఖమ్మం జట్టు 17.5 ఓవర్లు ఎదుర్కొని 145 పరుగులకు ఆల్ ఔట్ అయింది, రంగారెడ్డి జట్టు నవనీత్ రావు14 బౌండరీలు,రెండు సిక్సర్లతో సహాయంతో 91 పరుగులు సాధించి అద్భుత ప్రతిభ కనబర్చడంతో మాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.ఇదే గ్రౌండ్లో మధ్యాహ్నం జరిగిన రెండవ మ్యాచులో మహబూబ్ నగర్,నల్గొండ జట్లు తలపడగా మహబూబ్నగర్ నిర్దేశించిన భారీ 181 పరుగుల లక్ష్యాన్ని నల్గొండ జట్టు 17.5 ఓవర్లు ఎదుర్కొని 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది,నల్గొండ బ్యాట్స్మెన్ సాయినాథ్ 6 సిక్సర్,6 ఫోర్స్ సహాయంతో కేవలం 30 బంతుల్లోనే 72 పరుగులు చేసి ఒంటి చేతితో నల్గొండ జట్టును గెలిపించాడు.కాగా ఈ పోటీలను స్థానిక సర్పంచ్ భూక్య మేనక,ఉప సర్పంచ్ రవి చందర్,సుధాకర్ నాయక్,ఖమ్మం జిల్లా క్రికెట్ కార్యదర్శి చేకూరి వెంకటేశ్వర్లు,భార్గవ్ నిజామాబాద్ సురేష్ మరియు వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు అచ్చ వెంకటేశ్వర్లు రావు,రఘురామ్,తోట రాము తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *