ఆశీర్వదించి గెలిపించండిఆశీర్వదించి గెలిపించండి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ7 February, 2026E69NEWS

ఆశీర్వదించి గెలిపించండి

ఆశీర్వదించి గెలిపించండి

జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కూరపాటి కవిత యాదగిరి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వార్డు పరిధిలో గడప గడపకు తిరుగుతూ ఓటర్లను కలుసుకుని మద్దతు కోరారు.పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లిన కవిత యాదగిరి, గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వంటి పథకాలతో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. తనను గెలిపిస్తే పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, తాగునీటి సదుపాయాల మెరుగుదల కోసం కృషి చేస్తానని తెలిపారు.స్థానిక సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చిన ఆమె, 12వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు తనకు ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ ప్రచార కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, మహిళలు, యువకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *