బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగాబ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ25 March, 2026E69NEWS

బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా

బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా

ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో మంజూరు నగర్‌లో కొత్తగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్‌ను ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.బుధవారం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని బ్రాంచ్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో సమగ్ర అభివృద్ధి సాధించాలంటే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల విస్తరణ కీలకమని పేర్కొన్నారు.కొత్తగా ప్రారంభమైన ఈ ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా స్థానిక ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువవుతాయని,ముఖ్యంగా రైతులు, చిన్న వ్యాపారులు,మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.ఇప్పటి ఆధునిక కాలంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించిన కలెక్టర్, ఆన్‌లైన్ లావాదేవీల ద్వారా సమయం ఆదా కావడంతో పాటు పారదర్శకత పెరుగుతుందని వివరించారు. ఈ బ్రాంచ్‌లో సేవింగ్స్ ఖాతాలు, రుణ సదుపాయాలు, డిజిటల్ ట్రాన్సాక్షన్లు, ఏటీఎం సేవలు వంటి అన్ని రకాల ఆధునిక బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడంలో, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో ఈ బ్రాంచ్ కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. సేవల నాణ్యతతో ప్రజల మన్ననలు పొందాలని బ్యాంక్ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో ఎల్డియం తిరుపతి, డీజీఎం గన్ శ్యాం సోలంకి, ఆర్‌ఎం సుబ్బారావు, సింగరేణి జీఎం రాజేశ్వర రెడ్డి, బ్యాంక్ సిబ్బంది ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *