ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలిప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ6 May, 2026E69NEWS

ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలి

ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలి

జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్ నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి, స్టేషన్ పరిసరాలు, రికార్డులు మరియు విధి నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న సిబ్బంది వివరాలు తెలుసుకొని, ప్రతి పోలీస్ సిబ్బంది విధి సమయాల్లో తప్పనిసరిగా స్టేషన్‌లో అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఎప్పుడూ సులభంగా చేరుకునే విధంగా సేవలు అందించాలని సూచించారు,అదేవిధంగా పెండింగ్ కేసులపై వేగవంతమైన చర్యలు తీసుకుని విచారణను నాణ్యతతో పూర్తి చేయాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి తక్షణ స్పందన ఇవ్వాలని ఆదేశించారు. బీట్ వ్యవస్థను కచ్చితంగా అమలు చేస్తూ గ్రామాల్లో నేర నివారణ చర్యలను బలోపేతం చేయాలని, సీసీటీవీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ సాంకేతిక వనరులను సమర్థంగా వినియోగించాలని సూచించారు. స్టేషన్ పరిసరాలను శుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచడంతో పాటు మహిళలు, వృద్ధులు, పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.ఈ సందర్శన సమయంలో ఎస్సై బి. వెంకన్న, మరియు స్టేషన్ సిబ్బంది హాజరయ్యారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *