ఒంటిమామిడిపల్లిలో బీరన్న కళ్యాణోత్సవం ముగింపుఒంటిమామిడిపల్లిలో బీరన్న కళ్యాణోత్సవం ముగింపు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ7 May, 2026E69NEWS

ఒంటిమామిడిపల్లిలో బీరన్న కళ్యాణోత్సవం ముగింపు

ఒంటిమామిడిపల్లిలో బీరన్న కళ్యాణోత్సవం ముగింపు

హన్మకొండ జిల్లా:అయినవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామంలో గత వారం రోజులుగా వైభవంగా జరుగుతున్న బీరన్న కామరాతి కళ్యాణోత్సవం’పెద్ద పండుగ’ఘనంగా ముగిసింది.చివరి రోజు సందర్భంగా వర్ధన్నపేట కాంస్టెన్సీ మాజీ ఎమ్మెల్యే శ్రీ కొండేటి శ్రీధర్ గ్రామానికి విచ్చేసి బీరన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ కురుమ పెద్దలను శాలువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం అయినవోలు మండల బీజేపీ ఉపాధ్యక్షులు శ్రీ నరిగె రాజేష్ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ ని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆడెపు భాస్కర్, బొల్లెపల్లి మహేశ్వర్ గౌడ్, ఆడెపు విక్రమ్,రమేష్,నాగరాజు,మిగతా కురుమ పెద్దలు,బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వారం రోజుల పాటు జరిగిన బీరన్న కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *