గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లుప్రారంభంగురుకులాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లుప్రారంభం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ7 May, 2026E69NEWS

గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లుప్రారంభం

గురుకులాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లుప్రారంభం

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థ ఆధ్వర్యంలో వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల్లోని జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ.బై పి సి గ్రూపులలో ప్రవేశాలకు నేరుగా అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి డి.ఎస్. వెంకన్న తెలిపారు.
కౌన్సెలింగ్ తేదీ & వేదిక:
తేదీ: 16-05-2026, ఉదయం 10:00 గంటలకు
వేదిక: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, యాకుబ్‌పుర, వరంగల్.
ప్రవేశం కల్పించే కళాశాలలు:
గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలు:

  1. దేవన్నపేట, హనుమకొండ జిల్లా
  2. గూడూరు, పాలకుర్తి, జనగామ జిల్లా
  3. పర్వతగిరి, వరంగల్ జిల్లా
  4. మూడుచెక్కలపల్లి, నర్సంపేట, వరంగల్ జిల్లా
    గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాల:
  5. నర్సంపేట, వరంగల్ జిల్లా
    అర్హత: గిరిజన మరియు గిరిజనేతర విద్యార్థినీ, విద్యార్థులు అర్హులు.
    తీసుకురావాల్సిన పత్రాలు:
    టీసీ, మెమో, స్టడీ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ మరియు కుల ధృవీకరణ పత్రంతో పాటు 2 జతల జిరాక్స్ ప్రతులు తప్పనిసరిగా తీసుకురావాలి.
    ఆసక్తిగల విద్యార్థులు నిర్ణీత తేదీ, సమయానికి హాజరు కావాలని ఆర్సీఓ డి.ఎస్. వెంకన్న ఒక ప్రకటనలో కోరారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *