విద్యుత్ శాఖ పట్టణ అసిస్టెంట్ ఇంజినీర్ ఉబ్బన శరత్విద్యుత్ శాఖ పట్టణ అసిస్టెంట్ ఇంజినీర్ ఉబ్బన శరత్
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ8 May, 2026E69NEWS

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం”

విద్యుత్ శాఖ పట్టణ అసిస్టెంట్ ఇంజినీర్ ఉబ్బన శరత్

సత్తుపల్లి,ఆర్ సి,మే 08(తెలుగుగళం) న్యూస్ : సత్తుపల్లి మండల పరిధిలోని సదాశివునిపాలెం గ్రామంలో గల విద్యుత్ ఉపకేంద్రంలో నూతన ఏబీ స్విచ్‌ల ఏర్పాటు పనులు, ఉపకేంద్ర నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో నేడు అనగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ పట్టణ అసిస్టెంట్ ఇంజినీర్ ఉబ్బన శరత్ శుక్రవారం ఓ ప్రకటనలో మీడియా ద్వారా ప్రజలకు తెలిపారు.దీంతో సదాశివునిపాలెం,సిద్ధారం గ్రామాలతో పాటు తుంబూరు వ్యవసాయ ఫీడర్‌, నారాయణపురం ఫీడర్‌ పరిధిలో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *