విజయయ్యపల్లి ఆకినపల్లి గ్రామాల్లో వైభవంగా బొడ్రాయి మహోత్సవాలువిజయయ్యపల్లి ఆకినపల్లి గ్రామాల్లో వైభవంగా బొడ్రాయి మహోత్సవాలు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ9 May, 2026E69NEWS

విజయయ్యపల్లి ఆకినపల్లి గ్రామాల్లో వైభవంగా బొడ్రాయి మహోత్సవాలు

విజయయ్యపల్లి ఆకినపల్లి గ్రామాల్లో వైభవంగా బొడ్రాయి మహోత్సవాలు

ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా బొడ్రాయి ప్రతిష్ఠాపన వేడుకలు రంగరంగ వైభవంగా సాగుతున్నాయి.గోరికొత్తపల్లి మండలం విజయయ్యపల్లి గ్రామం మొగుళ్ళపల్లి మండలం ఆకినపల్లి గ్రామాల్లో శనివారం నిర్వహించిన బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన మహోత్సవాల్లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొనగా,గ్రామస్తులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గండ్ర వెంకటరమణారెడ్డి బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి,గ్రామ సంరక్షణ కోరుతూ మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామ పొలిమేర దేవతగా, గ్రామ రక్షణకు ప్రతీకగా భావించే బొడ్రాయి పండుగను ప్రజలందరూ కులమతాలకు అతీతంగా,అత్యంత ఐకమత్యంతో జరుపుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు.ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల గ్రామాల్లో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియడమే కాకుండా,ప్రజల మధ్య సోదరభావం పెంపొందుతుందని తెలిపారు.గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.మన పూర్వీకుల నుండి వస్తున్న ఇటువంటి గొప్ప సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,వివిధ మండలాల నాయకులు,మహిళలు,ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాన్ని దిగ్విజయం చేశారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *