ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేతముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ9 May, 2026E69NEWS

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేత

వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం, పరిధిలోని అన్నారం షరీఫ్ గ్రామంలో వర్ధన్నపేట శాసనసభ్యులు కే ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును గ్రామ సర్పంచ్ గాడిపెల్లి మహేందర్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు గొడుగు రమేష్, మండల యూత్ అధ్యక్షులు గొడుగు వినయ్, మరియు వార్డ్ మెంబర్స్ రాపోలు అనిత -రవీందర్ గాడి పెళ్లి రాజబాబు,దొంత మాల పవన్ కళ్యాణ్ నాయకులు కుమార్ ,రాజు, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *