మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం-మాజీ ఎమ్మెల్యే ఆరూరి
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలంలో ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మృతిచెందిన కుటుంబాలను వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి పరామర్శించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.పరామర్శించిన కుటుంబాలు:తురుకల సోమారం: ఘోర రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతిచెందిన మాజీ ఎంపీటీసీ వడ్లకొండ ఎల్లగౌడ్, ఎండీ అహ్మద్ కుటుంబాలను పరామర్శించారు.చౌటపల్లి:ఇటీవల మృతిచెందిన తోట కొమురు మల్లు కుమారుడు, బీఆర్ఎస్ నాయకుడు తోట స్వామి కుటుంబ సభ్యులను ఓదార్చారు.పర్వతగిరి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బుద్దె చరణ్, గుండెపోటుతో మృతిచెందిన అంకటి మల్లేష్ కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు.
దౌలత్నగర్ తాటిచెట్టుపై నుంచి పడి మృతిచెందిన దొనికేన శ్రీనివాస్ గౌడ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.ఈ పరామర్శలో కార్యక్రమంలో పర్వతగిరి పీఏసీఎస్ చైర్మన్ ఎం.మనోజ్ గౌడ్, మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఏడుదొడ్ల జితేందర్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు రంగు కుమార్ గౌడ్, స్థానిక నాయకులు మాడుగుల రాజు,ఏర్పుల శ్రీనివాస్,చీమల బిక్షపతి,మట్టపెల్లి చిన్నమాధవరావు,బూర శ్యామ్ గౌడ్,బొట్ల మధు,జూల్లపెల్లి దేవేందర్ రావు, బానోత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.