E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ17 February, 2023E69NEWS

వ్యాసరచన పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతుల ప్రధానం.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బి ఆర్ ఎస్ వి నాయకులు దీపక్ రెడ్డి,పరమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు కెసిఆర్ జన్మదిన సందర్భంగా శుక్రవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బహుమతులను ప్రధానం చేశారు. ఈ పోటీలలో మొదటి బహుమతి చైతన్య కళాశాల చెందిన మంజుశ్రీ, ద్వితీయ బహుమతి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన హసీబా బేగం, తృతీయ బహుమతి భాష్యం కళాశాలకు చెందిన విద్యాసాగర్ లను ఎంపిక చేసి బహుమతులను ప్రధానం చేశారు. అలాగే నాట్యంలో ఉత్తమ నృత్యకారుణిగా అక్షర స్కూల్ పాఠశాలకు చెందిన నక్షత్ర అనే విద్యార్థినికి బహుమతి ప్రధానం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, తాండూర్ పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు నయీమ్ (అఫ్ఫు ) సీనియర్ పాత్రికేయులు రవిశంకర్, బిఆర్ఎస్వి నాయకులు షోయబ్,నాసర్, నవీన్, శ్రీను వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *