ఈ69 న్యూస్ హన్మకొండ సెప్టెంబర్ 09

అదాలత్ సెంటర్‌లోని లింగాల కేదారి ఫుడ్ కోర్ట్‌లో బుధవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న వారు భయాందోళనకు గురయ్యారు.ఈ ఘటనలో ఫుడ్ కోర్ట్ నిర్వాహకుడు కేదారికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కేదారి మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు.షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *