అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశాలుఅంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశాలు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ10 March, 2026E69NEWS

అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశాలు

అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశాలు

పలిమెల గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య లక్ష్మి కమిటీ సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా గర్భిణీలు మరియు బాలింతలు ప్రభుత్వం అమలు చేస్తున్న “ఒక్క పూట భోజనం” పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని గ్రామ సర్పంచ్ జవ్వాజి పుష్పలత కోరారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణీలు,బాలింతలు సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యమని, ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలని ఆమె సూచించారు.అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.అనంతరం సర్పంచ్ పుష్పలత ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు యూనిఫామ్‌లను పంపిణీ చేశారు.పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని, తల్లిదండ్రులు వాటిని వినియోగించుకోవాలని ఆమె పేర్కొన్నారు.అలాగే ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు సంప్రదాయ పద్ధతిలో శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గర్భిణీలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ అవసరమైన సూచనలు అందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జవ్వాజి పుష్పలతతో పాటు పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, అంగన్వాడీ టీచర్లు సుశీల, కిష్టభాయి, సత్యవతి, ఆశా వర్కర్ పద్మ, వార్డు సభ్యులు కుమ్మరి రమేష్, జనగామ రాజేశ్వరి, తోలం నరసింహారావు, ఆలం ప్రశాంతి, పెద్దిశేఖర్, పెద్దిబాబు తదితరులు పాల్గొన్నారు.అలాగే గర్భిణీలు, బాలింతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *