కేసముద్రం 8వ వార్డులో సర్ ఇంటింటి సర్వేకేసముద్రం 8వ వార్డులో సర్ ఇంటింటి సర్వే
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ29 June, 2026E69NEWS

కేసముద్రం 8వ వార్డులో సర్ ఇంటింటి సర్వే

కేసముద్రం 8వ వార్డులో సర్ ఇంటింటి సర్వే

కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు చురుగ్గా పాల్గొన్నారు

•పారదర్శక ఓటరు జాబితా కోసమే ప్రత్యేక సవరణ-కౌన్సెలర్ సుభద్ర

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమం 8వ వార్డులో విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సెలర్ కనుకుల సుభద్ర,రాంబాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చురుకుగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పోలేపెల్లి వెంకట్ రెడ్డి,సీనియర్ నాయకులు సంకేపల్లి నారాయణ రెడ్డి,సంకెపల్లి శ్రీనివాసరెడ్డి హాజరై ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు.పార్టీ బి ఎల్ ఓ మడిపెళ్ళి కృష్ణమూర్తితో పాటు అరేందుల శ్రీనివాస్,కముటాం ప్రభాకర్, నిమ్మల రామకృష్ణ, కముటాం శ్రీధర్,కముటాం సురేందర్,లక్ష్మీనారాయణ,యకుబీ ప్రభుత్వ బి ఎల్ ఒ తో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటరు జాబితా సవరణ చేపట్టారు.
ఈ సందర్భంగా కౌన్సెలర్ కనుకుల సుభద్ర మాట్లాడుతూ,18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. తప్పుడు ఓట్లు,డూప్లికేట్ ఓట్లు తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితా తయారు చేయడమే సర్ లక్ష్యం” అని తెలిపారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *