దేశ భాషలలో తెలుగు లెస్స:ఎమ్మెల్యే మట్టాదేశ భాషలలో తెలుగు లెస్స:ఎమ్మెల్యే మట్టా
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ20 February, 2026E69NEWS

దేశ భాషలలో తెలుగు లెస్స:ఎమ్మెల్యే మట్టా

దేశ భాషలలో తెలుగు లెస్స:ఎమ్మెల్యే మట్టా

ఘనంగా అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలు

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో విద్యార్థులను ప్రశంసించిన రాగమయి

శుక్రవారం సత్తుపల్లి పట్టణంలో లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాలులో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో అంతర్జాతీయ మాతృ దినోత్సవంను పురస్కరించుకొని పట్టణానికి చెందిన టాలెంట్ పాఠశాల యాజమాన్యం నిర్వహించిన తెలుగు బుక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు.వేమన శతకాన్ని వల్లే వేసిన 250 మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు బహుకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాగమయి మాట్లాడుతూ దేశ భాషలలో తెలుగు లెస్స అనే గుర్తింపు తెచ్చుకున్న గొప్పతనం మన తెలుగు భాషది అని తెలిపారు.ముందుగా ఎమ్మెల్యే కు నిర్వాహకులు,విద్యార్థులు పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో: పట్టణ పురపాలక సంఘం చైర్మన్ మహమ్మద్ రెహానా బేగం కమాల్ పాషా,వైస్ ఛైర్మన్ బొంతు సుమలత,మండల విద్యాశాఖాధికారి నక్కా రాజేశ్వరరావు,వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ దోమ ఆనంద్ బాబు,సృజన సాహితీ సంస్థ నిర్వాహకులు,విశ్రాంత ఉపాధ్యాయులు,టాలెంట్ పాఠశాల ప్రిన్సిపాల్ పులి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *