రైతులు ప్రత్యామ్నాయ పంటలపై ద్రుష్టి సారించాలిరైతులు ప్రత్యామ్నాయ పంటలపై ద్రుష్టి సారించాలి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ10 July, 2026E69NEWS

రైతులు ప్రత్యామ్నాయ పంటలపై ద్రుష్టి సారించాలి

రైతులు ప్రత్యామ్నాయ పంటలపై ద్రుష్టి సారించాలి

వర్షాభావ పరిస్థితులపై ప్రత్యామ్నాయ మరియు పంట మార్పిడి అవగాహన సదస్సు

మరిపెడ మండల వ్యవసాయ విస్తరణ అధికారి వీర మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని బాల్ని ధర్మారం గ్రామంలో ఈరోజు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలు మరియు పంట మార్పిడి విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి రైతులు హాజరై, ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. అలాగే పంట మార్పిడి ద్వారా భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు దిగుబడులు, ఆదాయం పెరుగుతాయని వివరించారు.మండల వ్యవసాయ అధికారి బోడ వీరాసింగ్ మరియు ఏఈఈ శ్రీకాంత్ ఇరిగేషన్ వారు రైతులకు ప్రభుత్వ సూచనలు, శాఖ అందిస్తున్న సేవలు, వర్షాభావ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమగ్ర పంట నిర్వహణపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి జై. స్రవంతి, గ్రామ సర్పంచ్ జ్యోతి మధు బండ,రైతులు మరియు గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటలు
పెసర్లు, కందులు, మినుములు, ఆయిల్ పామ్, బొబ్బర్లు,జొన్నలు.మొదలగు పంటలపై ద్రుష్టి సారించాలి అని రైతులకు వివరించారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *