E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ28 February, 2023E69NEWS

సంపన్నులకు పన్ను రాయితీలను రద్దు చేయాలి.అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా

సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి. సంపన్నులకు పన్ను రాయితీలను రద్దు చేయాలని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం రోజున సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జనగామ పట్టణంలోని ఆర్టీసీ X రోడ్డు వద్దగల అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పాల్గొని మాట్లాడుతూ సంపన్నులకు రాయితీలు ఇచ్చి సామాన్యులపై పన్నులు వేసే కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్త నిరసనలో భాగంగా ధర్నా నిర్వహించడం జరిగిందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంపన్నులకు లక్షల కోట్ల రాయితీలిస్తూ ఆహార పదార్ధాలు, మెడిసిన్స్ జీఎస్టీ విధించే విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో అతి సంపన్నులు పెరిగిపోతున్నారని, వారికి కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున పన్ను మినహాయింపులిస్తున్నదని, ఆ పన్ను మినహాయింపులను రద్దు చేయాలని, సంపదపన్ను విధించాలని డిమాండ్ చేశారు. ఆహారసరకులు, నిత్యావసరాలు, ఔషదాలపై జీఎస్టీ విధించడం కారణంగా సామాన్యులకు తీవ్రమైన భారంగా మారుతున్నది, తక్షణమే వీటిపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ లో గ్రామీణ ఉపాధిహామీ చట్టానికి నిధులు తగ్గించారని… తక్షణమే కేటాయింపులు పెంచాలని, కూలిరేట్లు పెంచాలని కోరారు. రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యంతో పాటు 5కేజీల సబ్సిడీ బియ్యం కూడా కొనసాగించాలని, పేదలకు ఆహారభద్రత పెంచేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. దేశ సంపదను కొల్లగొడుతూ, కుంభకోణాలకు పాల్పడుతున్న అదానీ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై మరో స్వాతంత్రపోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి. ఉపేందర్, ఎస్. విజేందర్, ఆర్. మీట్యానాయక్, కె.లింగం, డి.సందీప్, ఎ. సురేష్, బి. బాబు. జి. మల్లేష్ రాజ్, డి. నాగరాజు, సిఎచ్. ఉపేందర్, గాడి శివ, ఎండి. మునీర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *