అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తా
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా అంగడీ సాంబరాజు ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వార్డు పరిధిలోని కాలనీలు, బస్తీలలో విస్తృతంగా పర్యటిస్తూ గడపగడపకు వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి మద్దతు కోరుతున్నారు.ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను ఆత్మీయంగా విని నమోదు చేసుకుంటూ, ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ముఖ్యంగా తాగునీటి సరఫరా, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.“ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేయడం నా ధ్యేయం. 16వ వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా. నన్ను ఆశీర్వదించి గెలిపించండి” అని అంగడీ సాంబరాజు ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.ప్రచారానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభిస్తోందని పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.వార్డు అంతటా ఎన్నికల సందడి నెలకొనగా అభ్యర్థి విజయంపై పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.