సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు
•సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూలై 30
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి వర్ధన్నపేట శాసన సభ్యులు, విశ్రాంత ఐ.పి.ఎస్ అధికారి కే.ఆర్.నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలో అమలవుతున్న పలు అభివృద్ధి పథకాల పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.గ్రామ సర్పంచులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు సకాలంలో సేవలు అందించాలని సూచించారు.మండల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు,సభ్యులతో కలిసి సమగ్రంగా చర్చించారు.మౌలిక సదుపాయాల కల్పన,సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధినే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.గ్రామాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం అంశాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలకు అధికారులు,ప్రజా ప్రతినిధులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ.డి.మైన్స్ అధికారి రవిశంకర్,జిల్లా పంచాయతీ అధికారి కల్పన, మండల అభివృద్ధి అధికారి, మండల రెవెన్యూ అధికారి,మండల విద్యా అధికారి,సర్పంచులు,ఇతర అధికారులుతదితరులు.పాల్గొన్నారు.