అన్నారంలో అక్రమ మట్టి దందా
అనుమతులు బంధువులు, స్నేహితుల పేర్ల మీద
•మట్టి అమ్మకాలు వేరే రైతులకు*
పర్మీషన్ కొంతమేరకు…తవ్వకాలు ఇష్టానుసారం
•ఆఫీసర్ల పర్యవేక్షణ కరువు
•అక్రమార్కునికి సహకరిస్తున్న వివిధ శాఖల అధికార యంత్రాంగం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో అక్రమ మట్టి దందా రోజురోజుకు మూడు పువ్వులు..ఆరుకాయలుగా విరాజిల్లుతుంది. దర్గా చెరువులో నల్ల రేగడి మట్టిని స్థానిక వార్డు మెంబర్ తన బంధువులు, స్నేహితుల పేర్ల మీద సంబంధిత ఆఫీసర్లతో పర్మీషన్ తీసుకుని వేరే రైతులకు రేగడిమట్టి కాకుండా మొరాన్ని తీస్తూ అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి జిల్లా ఆఫీసర్లతో సహా స్థానిక ఆఫీసర్ల అండదండలు ఉండడంతో అక్రమార్కుడు రెచ్చిపోతున్నాడు. సంబంధిత ఐబీ ఆఫీసర్లు పర్యవేక్షణ చేయక పోవడంతో నల్లరేగడి మట్టి పర్మీషన్లు మొరం దందాకు తెరలేపుతున్నాయి.లొకేషన్లో ఏ ఒక్క ఆఫీసరు ఉండక పోవడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్మీషన్ ప్రకారం…110 సర్వే నెంబర్ దర్గా శిఖం భూమిలో మాత్రమే మట్టిని చెరువుకట్టకు దూరంగా తీయాలి……ఇందులో నల్లరేగడి మట్టిని అనుమతులు పొందిన రైతుల పొలాల్లో పోయాల్సి ఉంది. కాని ఇక్కడ ప్రైవేటు అవసరాలు, ఖాలీ ప్లాట్లలో, ఎఫ్టీఎల్ భూములలో , చుట్టుపక్కల గ్రామాల ఇటుక బట్టీలకు సైతం మట్టిని అక్రమార్కులు అమ్ముకుంటున్నారు. ఉదయం 6నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే తరలించాల్సి ఉండగా అర్థరాత్రి వరకు మట్టిని తరలిస్తున్నే ఉన్నారు. మట్టి తోలే క్రమంలో స్థానిక రెవెన్యూ, పోలీస్ వారికి సమాచారం ఇచ్చి నిర్వహించుకోవాలి. అనుమతులు ఇచ్చిన 1000 క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ తీసుకోకుండా …ఏ ఏ రోజు ఎంత పరిమాణం లో తీశారో ఇరిగేషన్ డిఈఈ నిర్థారించాల్సి ఉంది. అనుమతులు ఇచ్చిన రోజులలో 1000క్యూబిక్ మీటర్లు ముందుగానే పూర్తి చేస్తే మట్టి తరలింపును ఆఫీసర్లు ఆపివేయాల్సి ఉంటుంది. అంతేకాక పర్మిషన్లు ఉన్న ట్రాక్టర్లే కాకుండా… ఎక్కువ ట్రాక్టర్లను పెట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మట్టి దందా పై పిర్యాదు చేసిన వారి వివరాలు ఆఫీసర్లు వెంటనే అక్రమార్కులకు చేరవేయడంతో వారిని సైతం బెదిరింపులకు గురిచేస్తూ…మేము ఆఫీసర్లకు…విలేకరులకు..మాముల్లు ఇస్తున్నామని మమ్మల్ని ఎవరూ ఏమి చేయరని బాహటంగానే వారితో వాగ్వాదానికి దిగుతున్నరాని విచారం వ్యక్తం చేస్తున్నారు.ఐబి ఆఫీసర్లు ఈనెల 26 నుంచి మట్టి తవ్వకాలకు పర్మిషన్ ఇస్తే ఈ అక్రమార్కులు ఈనెల 21 నుంచే ఇప్పటికీ వేల ట్రిప్పుల మట్టిని తరలించి అమ్ముకున్నారు. ఇప్పటికైనా మట్టి దందాను ఆపి అక్రమార్కుల పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు