అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో 27 నుండి ఉచిత న్యూరో క్యాంప్
నరాలు,మెదడు,వెన్నుపూస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రత్యేక న్యూరో క్యాంప్ నిర్వహించనున్నట్లు కొత్తపేటలోని అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది.ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ అభిలాష్ గజ్జల ఆధ్వర్యంలో ఈ క్యాంప్ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుంది.తలనొప్పి, పక్షవాతం, కాళ్లు-చేతుల తిమ్మిర్లు, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.క్యాంప్‌లో భాగంగా న్యూరో ప్రొఫైల్ రక్త పరీక్షలు, సీటీ స్కాన్, ఎన్సీఎస్, ఈఈజీ పరీక్షలను కేవలం రూ.1,000కే అందించనున్నారు.అంతేకాకుండా వెన్నుపూస శస్త్రచికిత్సలపై 20 శాతం ప్రత్యేక తగ్గింపు ఉంటుంది.వివరాలకు,ముందస్తు అపాయింట్మెంట్ కోసం 94598 75555 నంబరులో సంప్రదించాలని సూచించారు.