ఇల్లందలో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలంలోని, వర్ధన్నపేట ఇల్లంద వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్నిఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు ప్రారంబించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో పది సంవత్సరాల బి ఆర్ ఎస్ పాలనలో మక్కలకు మద్దతు ధర ఇచ్చిన పాపాన పోలేదు. రైతులు పౌల్ట్రీ పారాలకు అతి తక్కువ ధరకే అమ్ముకునే వారు. కానీ నేడు అందుకు భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వరి పండించిన రైతులకు మద్దతు ధరతో పాటు సన్నాలకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవడం జరుగుతుంది. మరియు మక్కలకు క్వింటాలుకు 2400/- రూపాయల మద్దతు ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.దేశంలోనే వరికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ మక్కాలకు కూడా మద్దతు ధర లేదు ఇది బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా లేదు రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ పై ఒక నమ్మకం ఏర్పడింది ఈ రాష్ట్రములో రైతు ఏ పంట వేసిన రైతు పండించిన ప్రతి పంటను కూడా మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
గత పది సంవత్సరాల కాలంలో రైతు ఏ పంట పండించిన భయంతో పండించేది. పంట చేతికి వచ్చే సరికి బి ఆర్ ఎస్ పాలనలో కొనుగోలు చేస్తాధో, చెయ్యదొ అనే భయంతో ఉండే వారు, వరి వేస్తే ఉరి అనే సరికి రైతులు ఆ భద్రత భావంతో జీవించేవారు.ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు రైతు భరోసా తో సంతోషంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం ఇల్లంద సర్పంచ్ బేతి సాంబయ్య, సి ఇ ఓ వెంకన్న, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోశాల వెంకన్న గౌడ్, మాజీ పీ ఏ సీ ఎస్ చైర్మన్ కౌడగని రాజేష్ కన్నా, మార్కెట్ డైరెక్టర్ మల్యాల దేవేందర్, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు తుళ్ల రవి, అంబేద్కర్ నగర్ సర్పంచ్ చిటూ రి రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కట్కూరి స్వామి,మరుపట్ల సాయికుమార్, గుంటి కుమారస్వామి,కర్ర శ్రీనివాస్ రెడ్డి,గూగులోతూ కిషన్ నాయక్,అడ్డగట్ట రాములు తదితరులు పాల్గొన్నారు.