ఉద్యోగ జీవితంలో బదిలీలు సర్వ సాధారణం
మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బదిలీపై వెళ్తున్న సిబ్బందికి ఘన వీడ్కోలు మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సుదీర్ఘకాలం పాటు ప్రజలకు విశిష్ట సేవలందించి, బదిలీపై వెళ్తున్న వివిధ విభాగాల సిబ్బందికి మాతృ సంస్థలో ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం జరిగింది. వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భూక్యా రవి రాథోడ్, డీప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ సుధీర్ రెడ్డి,ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న సిబ్బందిని శాలువాలు, పూలమాలలతో అధికారులు, తోటి సిబ్బంది అత్యంత ఘనంగా సన్మానించారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. బదిలీపై వెళ్తున్న సిబ్బంది ఇన్ని సంవత్సరాల పాటు వైద్య రంగంలో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఎన్నో ప్రజారోగ్య కార్యక్రమాలను ఎంతో అంకితభావంతో విజయవంతం చేశారని కొనియాడారు. ప్రజారోగ్య పరిరక్షణలో దశాబ్దాల పాటు అలసిపోకుండా వారు అందించిన సేవలు ఎనలేనివని ప్రశంసించారు. కొత్త ప్రాంతాలలో కూడా ఇదే ఉత్సాహంతో పని చేసి, ప్రజల మెప్పు పొందాలని ఆకాంక్షించారు.
బదిలీ అయిన సిబ్బంది వివరాలు:
సుదీర్ఘ కాలం సేవలందించి బదిలీ అయిన వారిలో బి. విజయకుమారి (32 సంవత్సరాల సేవ), సిహెచ్. సరళ (31 సం.), మోహినమ్మ (30 సం.), వెంకటేశ్వర్లు (28 సం.), చంద్రకళ (18 సం.), ఏ.బి.టి. సుందరి (18 సం.), నర్సబాయి (18 సం.), ఆర్. పద్మ (16 సం.), ఫెరోజ్ (10 సం.), సీనియర్ అసిస్టెంట్ ఎస్. రవిచంద్ర (4 సం.), మరియు సాయిశ్రీ (MLHP – 4 సం.) ఉన్నారు.ఈ కార్యక్రమంలో వీడ్కోలు వేడుకలో డాక్టర్ పూజిత, డాక్టర్ స్వామి, డాక్టర్ కిరణ్ సాగర్, పిహెచ్ఎన్ఓ మంగమ్మ, హెల్త్ సూపర్వైజర్లు ఆచార్యులు, మాధవి, లలిత కుమారిలతో పాటు పల్లె దవాఖానా సిబ్బంది, ఏఎన్ఎంలు,ఆశా ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆసుపత్రి సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని బదిలీ అయిన వారికి ఆత్మీయ వీడ్కోలు పలికారు.