ఏప్రియల్ 2 న ప్రజా పాలన సభలు
జిల్లాలో మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రజా పాలన సభల్లో ప్రారంభించాలి
రాష్ట్ర ప్రభుత్వం ఏప్రియల్ 2 నుంచి నిర్వహించే ప్రజా పాలన సభలు రైతు సమస్యలు పరిష్కార వేదికగా నిర్వహించాలని , ప్రజా పాలన సభల్లో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు.
మంగళవారం వైరా బోడేపూడి వెంకటేశ్వరరావు భవన్ లో రైతు సంఘం పట్టణ అధ్యక్షులు మల్లెంపాటి రామారావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ, మండల కమిటీ సంయుక్త సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా లో రైతులు మొక్కజొన్న,వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక పోవడం మరోవైపు వాతావరణ మార్పులు అకల వర్షాలు హెచ్చరికలు మధ్య తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. రైతులు విక్రయం కు సిద్ధం గా ఉంచిన మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కోసం కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని లేకపోతే అకల వర్షాలు హెచ్చరికలు నేపధ్యంలో అతి తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు రైతులు విక్రయం చేసే పరిస్థితి నెలకొంది అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగం కు నిధులు కేటాయింపులు తక్కువ చేయడం వల్ల రైతులపై ఎరువులు భారం పెరిగే అవకాశం ఉంది అని అన్నారు, సోమవరం రెవెన్యూ లో నిషేధిత జాబితాలో ఉంచిన సాగు భూములను ఆ జాబితాలో నుంచి తొలింగించాలని డిమాండ్ చేశారు . ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి కిలారు శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తూము సుధాకర్, హరి వెంకటేశ్వరరావు కామినేని రవి, వెంపటి రాజా, శీలం వెంకటరెడ్డి, గాలి అరుణ, చింతనిప్పు చంద్రరావు, నల్లమల కోటేశ్వరరావు, ఎస్ కె మజీద్ బి, ఎస్ కె రహినా, యనమద్ది రామకృష్ణ, నర్వనేని సత్యం, దొంతి బోయిన అచ్చారావు, వడ్లమూడి మధు, గుమ్మా మురళి, చిత్తారు మురళి తదితరులు పాల్గొన్నారు.