కరోనా కంటే ప్రమాదకారి డ్రగ్స్.
సమాజాన్ని అతలాకుతలాం చేసిన కరోనా కంటే అత్యంత ప్రమాదకారి డ్రగ్స్ అని, దీన్ని శాశ్వతంగా తుదbముట్టించేందుకు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తల్లాడ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటకృష్ణ సూచించారు. మంగళవారం 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమాల్లో డ్రగ్స్ రహిత సమాజం.. డ్రగ్స్ అడ్డుకట్టపై అవగాహన సదస్సు తల్లాడ మండలంలోని అన్నారుగూడెం హైస్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సై మాట్లాడుతూ డ్రగ్స్ గతంలో విదేశాలలో, ఇతర రాష్ట్రాల్లో ఉండేవని, ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో కూడా వ్యాప్తి చెందాయనీ, దీనిపట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటికి బానిసైతే జీవితం అంధకారం అవుతుందన్నారు. చిన్నపిల్లలకు చాక్లెట్లలో కూడా మత్తు పదార్థాలు కలిపి అమ్మకాలు చేస్తున్నారని, అపరిచిత వ్యక్తులు ఎవరైనా చాక్లెట్ లాంటివి ఇస్తే తీసుకోవద్దని సూచించారు. ఎక్కడైనా డ్రగ్స్ ఉన్నట్లు తెలిస్తే 1908కు సంప్రదించాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో శ్రీధర్ రాజు, ఎంపీఓ ఏనుగు సురేష్ బాబు, ఈగల్ ఎస్సై రమేష్, ఆబ్కారీ ఎస్ఐ రతన్ రెడ్డి, అటవీ శాఖ రేంజర్ ఉమా, అన్నారుగూడెం వైద్యులు గోపి, ఉప సర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు(కేవీ) డ్రగ్స్ మాఫియా వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలని క్షుణ్ణంగా వివరించారు. అనంతరం అందరు కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.