రైతు సదస్సులో వినతులు స్వీకరించిన మంత్రి పొంగులేటి
రైతు సదస్సులో వినతులు స్వీకరించిన మంత్రి పొంగులేటి”
సత్తుపల్లి/కల్లూరు, జూలై 30 (తెలుగుగళం): సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరులో గురువారం ప్రజా దర్బార్, రైతు సదస్సు ఘనంగా నిర్వహించారు. కల్లూరు, తల్లాడ మండలాలకు చెందిన ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు డీఎన్‌పీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్, ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్, కల్లూరు ఉప కలెక్టర్ అజయ్ యాదవ్, అదనపు కలెక్టర్, అటవీ శాఖ జిల్లా అధికారి, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కల్లూరు, తల్లాడ మండలాలకు చెందిన వేలాది మంది ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌కు అందజేశారు. ప్రజలు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించిన మంత్రి సంబంధిత శాఖల అధికారులను సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ప్రజా దర్బార్ విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, డాక్టర్ మట్టా దయానంద్ కృతజ్ఞతలు తెలిపారు.