కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డెడ్ లైన్
రంగాయ చెరువు ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయకుండా రైతుల పంటలు ఎండబెడుతు
- బీఆర్ఎస్ కు పేరు వస్తుందనే పెండింగ్ లో పనులు
- నేల రోజుల్లో కాలువల పనులు పూర్తి చేయకపోతే రైతుల తిరుగుబాటు తప్పదు
- రామప్ప – రంగాయి చెరువు – పాకాల ప్రాజెక్ట్ లో భాగమైన కాలువల నిర్మాణ పనులను పూర్తి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో రంగయ్య చెరువు కాలువల పనులు పూర్తి చేసి పంటలకు నీళ్లు ఇవ్వాలని రైతులు నిరసన తెలిపారు.రుద్రగూడెం రంగయ్య చెరువు కాలువ వద్ద రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. ఈ నిరసనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది.
- ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ
- తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వం లో గోదావరి జలాలను నర్సంపేట నియోజక వర్గానికి తరలించే క్రమంలో 3.5 టీఎంసీ నీళ్లను రంగాయి చెరువుకు తరలించే పనులు విజయవంతంగా పూర్తిచేసాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటై ఏండ్లు పూర్తి ఐనపాటికి ఇనాటికీ కాలువల నిర్మాణం పనులు పూర్తి చేయలేదు గోదావరి జిల్లాలు రంగాయ చెరువు లో అందుబాటులో ఉన్న కాలువల పనులు పూర్తిగా గత రెండు సంవత్సరాలుగా పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తుంది. సుమారు 87% పనులు పూర్తయిన మిగిలిన పనులను పూర్తి చేయకుండా రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుంది. నర్సంపేట రైతాంగం బంగారు పంటలు పండించాలని గోదావరి జలాలను నర్సంపేటకు తీసుకురావడం జరిగింది. తలాపుల నీళ్లు ఉన్నా చిన్న చిన్న పనులు పూర్తి చేయగా రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుంది. బిఆర్ఎస్ హయంలో పూర్తయిన ప్రాజెక్టును అక్కడక్కడ మిగిలిపోయిన పనులను రెండేళ్లుగా పూర్తి చేయకుండా రైతులను కాంగ్రెస్ మోసం చేస్తుంది.
- నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల 68 గ్రామాల రైతుల పంటలకు సాగు నీటిని అందించే రంగయ్య చెరువు ప్రాజెక్ట్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాది. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు అనేక సార్లు వచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రంగయ్య చెరువు ప్రాజెక్టు పై ఒక్కసారి కూడా అధికారులతో సమీక్ష చేయలేదు. 32 వేల 500 ఎకరాలకు సాగు నీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ నేను శాసన సభ్యుడిగా అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా తీర్చిదిద్దడం జరిగింది. రీ డిజైన్ చేసి ఒక్క ఎకరం ముంపు లేకుండా, ప్రతి చెరువు కుంట ప్రత్యేక సర్వే నిర్వహించి , అనేక అనుమతులు తీసుకువచ్చి, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ లింక్ మెయిన్ కెనాల్, ద్వారా 32 వేల 500 ఎకరాల పంటకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ గా రూపొందించాము. 87% శాతం పనులను పూర్తి చేసాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 28 నెలలు గడిచిన ఒక్క శాతం పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టలేదు. ఒక్కనాడు కూడా సమీక్ష చేయలేదు, కొత్తగా నిధులు రావాల్సిన అవసరం లేదు, నిధులు మెగా ఏజెన్సీ టెండర్ ద్వారా 40 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నాయి, ఆ నిల్వ ఉన్న నిధులు ఖర్చుపెట్టండి. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కాంట్రాక్టర్ కాబట్టి ఎప్పుడూ ఊర్లు ముంచుదామ, వేల ఎకరాల పంటను ముంచుదామా, అమాయకు గిరిజన భూములలో ప్రాజెక్టు కట్టి, పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని ఆశ మాత్రమే ఉన్నదీ కాలువల పనుల నిర్మాణం గురించి,మరమ్మతుల గురించి ఎన్నడు ఆలోచించలేదు నిర్మాణమైన కాలువల నుండి గోదావరి జలాలు ప్రతి ఎకరానికి పోయే విధానంగా పంట కాలువలు, చిన్న కాలువలు, తవ్వించడానికి ఇంకా 40 కోట్ల రూపాయలు నిధులు నిల్వ ఉన్నాయి. 40 కోట్ల రూపాయలు వెంటనే ఖర్చు చేయాలి, అధికారులతో వెంటనే సమీక్ష నిర్వహించాలి , ఎండాకాలం సీజన్ పూర్తయ్యే వరకు పంట కాలువలను పూర్తి చేసి రెండో పంటకు నిరందించాలి, నేషనల్ హైవే 365 కి సంబంధించి కాలువ అటు ఇటు తవ్వడం జరిగింది. 365 నేషనల్ హైవే కాబట్టి డిల్లీ నుంచి అనుమతులు రావాలని ఆనాడు నేను శాసన సభ్యుడిగా ఉన్నప్పుడూ ఢిల్లీకి అనుమతులు కొరకు పంపివ్వడం జరిగింది. దానికి సంబంధించి ఒక్కనాడు అధికార పార్టీ వాళ్ళు సమీక్షించే పరిస్థితి లేదు ఇప్పటికీ కూడా వాళ్ళు తవ్వే పరిస్థితి లేదూ అనుమతులు తెచ్చే పరిస్థితి లేదు, రాజకీయ కుట్రలు ఏమైనా ఉంటే నాపైన చేయండి కానీ రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టుపైనా కాదు రంగయ్య చెరువు ప్రాజెక్టు మరియు కాలువ నిర్మానం పైన గత రెండేళ్లుగా ఒక సమీక్ష కూడా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి నిర్వహించకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది.కాలువలను నిర్మాణం మరియు మరమ్మత్తుల కోసం 40 కోట్ల నిధులు నిల్వ ఉన్నప్పటికీ పనులు చేయకుండా ఎమ్మెల్యే రైతులను మోసం చేస్తున్నారు. నిధులు ఉన్నప్పటికీ పనులు చేయించే నాయకత్వం లేకపోవడం నర్సంపేట రైతుల పాలిట శాపంగా మారింది. కాలువలు నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా నాడు రైతులకు మార్కెట్ ధరను మించి పరిహారం ఇప్పించడం జరిగింది. నేడు మిగిలిన కాలువలకు మార్కెట్ ధరను మించి రైతులకు చెల్లించాల్సిందే.. ఆ బాధ్యత బిఆర్ఎస్ తీసుకుంటుంది. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్కు నెలరోజుల డెడ్లైన్ విధిస్తున్నం. లేనిపక్షంలో రైతుల తిరుగుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే మాధవరెడ్డి చవి చూడాల్సి ఉంటుంది. తక్షణమే కాలువల పనులు పూర్తి చేసి రైతాంగానికి నీరు ఇవ్వాలి. ఈ నిరసన ఆరంభం మాత్రమే. తదుపరి నర్సంపేట నియోజకవర్గం కలెక్టరేట్ ను ముట్టడిస్తాం నీళ్లిస్తే కేసీఆర్కు పేరు వస్తుందని పనులను ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది నీళ్లు ఉన్న పనులు పూర్తి చేయలేని కాంగ్రెస్ అసమర్ధత వల్ల వేల ఎకరాల్లో రైతుల పంటలు ఎండుతున్నాయి నెల రోజుల్లో పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో రైతులు ఎమ్మెల్యేను గ్రామాల్లో తిరగనివ్వరని హెచ్చరిస్తున్నాం.
- ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లు నియోజకవర్గ కోఆర్డినేటర్ మండల పార్టీ అధ్యక్షులు మండల ఎన్నికల కన్వీనర్ మాజీ ఎంపీపీలు మాజీ జడ్పిటిసిలు, నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ నాయకులు, క్లస్టర్ బాధ్యులు,వైస్ ఎంపీపీ, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు సర్పంచులు,ఉపసర్పంచ్ లు, పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.