కిష్టారంలో సింగరేణి వైద్య శిబిరం
అంబేద్కర్ నగర్, కిష్టారం గ్రామం నందు సింగరేణి ఆధ్వర్యంలో వైద్య శిబిరం
సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ అధికారి ఏ ఎల్ ఎస్ వి సునీల్ వర్మ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. అంబేద్కర్ నగర్ మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల, కిష్టారం గ్రామం నందు సింగరేణి వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.ఈ వైద్య శిబిరాన్ని కిష్టారం గ్రామస్తులు ఉపయోగించుకున్నారు. గ్రామస్తులకు పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంనందు బీపీ,చక్కెర జబ్బులకు చెందిన రక్త పరీక్షలు చేసారు.ఈ కార్యక్రమంలో:సింగరేణి వైద్యులు డాక్టర్ కె శివ కుమార్,కిష్టారం వెల్ఫేర్ ఆఫీసర్ సాయిశ్వేత మరియు కిష్టారం గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు