
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయురాలి సేవ
తెలుగు గళం న్యూస్ ఐనవోలు మార్చి 20
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గరిమిళ్లపల్లి గ్రామ ప్రాధమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న గోపు ఆరోగ్యమ్మ తమ తల్లిదండ్రులు కీ.శే. గోపు శౌరీలమ్మ, గోపు రాయపు రెడ్డిల జ్ఞాపకార్థం పాఠశాల అభివృద్ధికి ముందుకు వచ్చారు. సుమారు రూ.1,00,000 ఖర్చు చేసి పాఠశాల భవనాల లోపల, వెలుపల పేయింటింగ్ చేయించి పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు.ఆమె ఔదార్యాన్ని మెచ్చుకున్న మండల విద్యాశాఖ అధికారి ఆనందం మరియు ఐనవోలు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వేంకటేశ్వర్లు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొని ఆరోగ్యమ్మని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

