మంత్రి సీతక్క ఆదేశాలతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకుల పర్యటన.
రోహీర్ ముంపు ప్రాంతాల పరిశీలన.
మంత్రి సీతక్క ఆదేశాలతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకుల పర్యటన.
లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే పునరవాస కేంద్రాలకు తరలిరావాలి – కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి.
తెలుగు గళం ఏటూరునాగారం:
మంత్రి సీతక్క ఆదేశాలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు ఏటూరునాగారం మండలంలోని రోహీర్ గ్రామ గోదావరి ముంపు ప్రాంతాలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి గుడ్ల దేవేందర్తో పాటు కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వరద పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించి, అధికారులతో సమన్వయం చేస్తూ ప్రజల భద్రతకు అవసరమైన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ముందస్తుగా సురక్షిత ప్రాంతాలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరవాస కేంద్రాలకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పోలీస్ శాఖ సిఐ ఏటూరునాగారం హెచ్చరికలు జారీ చేస్తూ గోదావరి తీర ప్రాంతాలు, వరద ప్రవాహం ఉన్న ప్రదేశాలకు ఎవరూ వెళ్లవద్దని, ముఖ్యంగా రైతులు, జాలర్లు, పశువుల కాపరులు, యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రి సీతక్క జిల్లా, మండల అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారని తెలిపారు. అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి తాజద్దీన్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చెన్నూరు బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి కొండగొర్ల పోషయ్య, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సోదారి హరీష్, ఆత్మ డైరెక్టర్ ఎస్.డి. ముస్తఫా, సర్పంచ్ కావిరి అర్జున్, పోలబోయిన గోపాల్, చెన్నేం ఎల్లయ్య, కందుకూరి రతన్ కుమార్, గజ్జెల రమేష్, గ్రామస్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.