గౌడ కార్మికుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక భరోసా
పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న మోడెం ఉమేష్ గౌడ్
గీత కార్మికుల కుటుంబాల్లో ఆపదలు ఎదురైనప్పుడు ముందుండి పరామర్శిస్తూ ఆర్థిక భరోసా కల్పించడం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ మోడెం ఉమేష్ గౌడ్ ప్రత్యేకతగా నిలుస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.రేగొండ మండల కేంద్రానికి చెందిన గౌడ కార్మికుడు తడుక స్వామి గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, మంగళవారం మోడెం ఉమేష్ గౌడ్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుని కుమారుడు శ్రీకాంత్ గౌడ్‌తో పాటు కుటుంబ సభ్యులను కలసి ఓదార్చి,మనోధైర్యం చెప్పడంతో పాటు రూ.2,000/- ఆర్థిక సహాయం అందజేశారు.గీత కార్మికులు, గౌడ కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలను దగ్గరగా తెలుసుకుంటూ, అవసరమైన సమయంలో తన వంతు సహాయం అందించడం ఉమేష్ గౌడ్ ఎప్పటికీ కొనసాగిస్తున్నారని ఆయన అనుచరులు తెలిపారు. గౌడ కార్మికులతో పాటు ఇతర పేద వర్గాలకు చెందిన ప్రజలను కూడా ఆదుకుంటూ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు తడుక మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షులు మాడగాని శంకర్ గౌడ్, గీత కార్మికులు గండి శంకర్, మడగాని సారయ్య, గండి తిరుపతి గౌడ్, మోటపోతుల సంతోష్, గండి శేఖర్, మాడగాని సురేష్, మడగాని నరేష్, గుండెబోయిన శంకర్, తడక సతీష్ తదితరులు పాల్గొన్నారు.