ఘనంగా ధనుర్మాస పూజల ముగింపు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని తిరుమల నాద స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస పూజలు నేటితో ఘనంగా ముగిశాయి.ఈ సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించగా,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఈ కల్యాణ మహోత్సవాన్ని పూజారులు కలకోట రామానుజాచార్యులు,శేషాచారి,వారుణాచార్యులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.గోదాదేవి అమ్మవారి ప్రత్యేక అలంకరణతో పాటు కొలిపాక వర్షిణి చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో
కొలిపాక సతీష్-సునీత దంపతులు,యాద శ్రీనివాస్-జయ దంపతులు,సారబు ఆంజనేయులు,పాల శ్రీను-లత,కుంభం నరేందర్-హేమలత,చింతకుంట్ల బాస్కర్ రెడ్డి,గోలి రాజశేఖర్,ఐత ప్రభాకర్,తెల్లకుల రామకృష్ణ,నగేష్-దేవకి,హరిప్రియ,మంజుల,ఉమ,పద్మ,యాదమ్మ,శ్రీమతి,సుష్మా,లలిత,రమ,సంధ్య,రేవతి,జ్యోతి,రాజా,చంద్రకళ,స్వప్న తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.