జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మంత్రుల నిలదీత
దశాబ్ద తరబడి అపరిస్కృతంగా ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను సత్వరమే పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి లతో కూడిన జర్నలిస్టుల బృందం నిలదీశారు.
ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో బుధవారం జరిగిన అధికారిక కార్యక్రమంలో ముగ్గురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి యు డబ్ల్యూ జె టీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి లు జర్నలిస్టుల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. దశాబ్దాలు తరబడి జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని, అనేక దఫాలుగా వినతిపత్రాలు విజ్ఞప్తులు, చేస్తున్న తీవ్ర కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వైఖరి సరైంది కాదని, ఇప్పటికైనా జర్నలిస్టులకు తక్షణమే ఇళ్లస్థలాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రులు స్పందిస్తూ జర్నలిస్టుల సమస్యలపై సత్వరమే సమాలోచనచేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాలు అంశంలో కూర్చొని చర్చించి సమస్యను పరిష్కరించుకుందామని మంత్రులు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టియు డబ్ల్యూ జే టి.జె.ఎఫ్ జిల్లా కార్యదర్శి చిర్రా రవి, జాతీయ కౌన్సిల్ సభ్యులు వెన్నబోయిన సాంబశివరావు,ఎలక్ట్రాన్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీకాంత్ , జిల్లా ఉపాధ్యక్షులు మందులు ఉపేందర్,ఎలక్ట్రాన్ మీడియా నగర అధ్యక్షులు యలమందల జగదీష్, సాయి , ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, ఉపాధ్యక్షులు పానకాలరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్ రెడ్డి,వీడియో గ్రాఫర్స్ జిల్లా అధ్యక్షులు నాగరాజు, సుధాకర్, ఐజేయు నాయకులు గుండ్ల రాంబాబు, టీజేఎఫ్ నాయకులు మోహన్, తోట గణేష్,