డిజిటల్ పద్ధతిలో బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
త్వరలో ప్రతి బూత్ కు ఇద్దరి చొప్పున 283 బూత్ లకు ఇన్చార్జిల నియామకం
• నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలలో కోఆర్డినేషన్ కమిటీల ఏర్పాటు
• డిజిటల్ సభ్యత్వం పై బూత్ ఇన్చార్జి లకు త్వరలో శిక్షణ తరగతులు
• సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా పనిచేయాలి
• సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతరం గ్రామ ,మండల,జిల్లా కమిటీల ఏర్పాటు
• నర్సంపేట నియోజకవర్గ సభ్యత్వం నమోదు కార్యక్రమం పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్యే ముతిరెడ్డి యాదగిరి రెడ్డి నియామకం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ డిజిటల్ ఆన్లైన్ పద్ధతిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం త్వరలో చేపట్టబోతున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 283 భూతులకు గాను ప్రతి బూత్ కు ఇద్దరు చొప్పున ఇన్చార్జిలను నియమించి త్వరలో వాళ్లకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టబోతున్నాము సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించుటకుగాను అన్ని మండలాలలో మండల స్థాయి కోఆర్డినేషన్ ,సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నాము కోఆర్డినేషన్ కమిటీ ద్వారా ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం పర్యవేక్షించబడుతుంది సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సూచించారు.పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతరం అన్ని గ్రామాలలో గ్రామ కమిటీలను, మండల కమిటీలను మరియు జిల్లా కమిటీలను కూడా రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేయబోతున్నది నూతనంగా ఏర్పాటు చేయబోయి కమిటీలలో క్రియాశీలంకంగా పనిచేసే కార్యకర్తలకు యువతకు పెద్దపీటా వేయనున్నట్లు తెలిపారు.