
ఈ69న్యూస్ ధర్మసాగర్ ఏప్రిల్ 25
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.గ్రామ సర్పంచ్ పుట్ట రేణుక కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హనుమకొండ కోర్టు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ జి. రామలింగం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు చట్టాలపై అవగాహన పెంపొందించడం ద్వారా తమ హక్కులను రక్షించుకోవచ్చని ఆయన తెలిపారు.అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి. అనూష మహిళల హక్కులు, బాల్య వివాహాల నిరోధక చట్టాలపై వివరించి, బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు.అడ్వకేట్ సొల్లేటి రామకృష్ణ ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని అధికారులు ఆకాంక్షించారు.