పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే మలేరియా దూరం
వరంగల్ జిల్లా:ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ్ చంద్ర,సబ్ యూనిట్ ఆఫీసర్ యాదయ్య,సూపర్వైజర్లు రాజు,స్వర్ణకుమారి, హెల్త్ అసిస్టెంట్లు మచ్చరెడ్డి, ప్రేమ్ పాల్గొన్నారు.ఆశావర్కర్లు కూడా పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని మలేరియా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ అరుణ్ చంద్ర మాట్లాడుతూ మలేరియా దోమకాటు ద్వారా వ్యాపించే ప్రమాదకర వ్యాధి అని, పరిసరాల పరిశుభ్రత,నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ద్వారా మలేరియాను నివారించవచ్చని సూచించారు.జ్వరం వచ్చిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్ష చేయించుకోవాలని ప్రజలకు సూచించారు.ర్యాలీలో “మలేరియా రహిత సమాజం మన లక్ష్యం”, “నిల్వ నీరు-దోమల నిలయం” అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అవగాహన కల్పించారు.