
ఈ69న్యూస్ వర్ధన్నపేట మార్చి 20:
పర్వతగిరి మండలంలో విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు పర్వతగిరి ఎస్సై బి. ప్రవీణ్ ఆధ్వర్యంలో అన్నారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న పాన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.తనిఖీల్లో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు సుదర్శన్ (72), వెంకటేశ్వర్లు (50)పై కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై ప్రవీణ్ మాట్లాడుతూ, 18 సంవత్సరాల లోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నేరమని, అలాగే విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.