ప్రజా సమస్యల కోసం పోరాడిన కలం మూగబోయింది
రంగల్ జిల్లా:వర్ధన్నపేట ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ శ్రీరామ్ రమేష్ మృతి చెందడం బాధాకరమని టీడబ్ల్యూజేఎఫ్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కరిమిళ్ల దుర్గారావు అన్నారు.
అవినీతి,స్వార్థం లేకుండా మంచి మనసుతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన పత్రిక రంగంలో నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు.నీతి,న్యాయం కోసం నిలబడిన శ్రీరామ్ రమేష్ మరణంతో వర్ధన్నపేట ప్రజలు,అభిమానులు, పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు తీవ్ర దుఃఖంలో ఉన్నారని తెలిపారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు దుర్గారావు పేర్కొన్నారు.